వేసవి దృష్ట్యా వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్ కొరత ఉండొద్దని అధికారులను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంత విద్యుత్ కావాలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఎస్సీ, ఎస్టీల కు ఇచ్చే రాయితీ విద్యుత్‌కు సకాలంలో నిధులివ్వాలని ఆదేశించారు. కృష్ణపట్నం, విజయవాడ థర్మల్ యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలం జరిగితే భారంగా మారతాయని చెప్పారు. సత్వరమే నిర్మాణాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.