తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr Pooja: ప్రగతిభవన్​లో నల్లపోచమ్మకు కుటుంబసమేతంగా సీఎం పూజలు - Cm Kcr Pooja news

సీఎం కేసీఆర్​.. ప్రగతిభవన్​లోని నల్లపోచమ్మకు ఘనంగా పూజలు (Cm Kcr Pooja) నిర్వహించారు. కుటుంబంతో సహా పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Cm Kcr Pooja
సీఎం పూజలు

By

Published : Oct 15, 2021, 5:55 PM IST

విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్​లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు (Cm Kcr Pooja) నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు- శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, తెరాస ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నల్లపోచమ్మకు కుటుంబసమేతంగా సీఎం పూజలు

ప్రముఖుల శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు పలువురు రాజకీయ ప్రముఖులు దసరా శుభాకాంక్షలు(CM KCR Dussehra Wishes) తెలిపారు. తెలంగాణకు దసరా ప్రత్యేకమైన పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని దుర్గాదేవిని ప్రార్థించానని పేర్కొన్నారు.

సీఎం వాహన పూజ

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, పలువురు ప్రజాప్రతినిధులు ట్విటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు.. వారి అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెెెెడ్డి.. ధర్మానిదే అంతిమ విజయమని విజయదశమి చాటిచెప్పిందని అన్నారు. ప్రజలందరి జీవితాల్లో ఈ పండుగ వెలుగులు నింపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details