మంచిర్యాలలో డిసెంబర్ 20 నుంచి 23 వరకు సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని... ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. మతోన్మాదం పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సీఎం కేసీఆర్ స్వయంగా 27 వేల కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయని తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెబుతుంటే... ముఖ్యమంత్రి మాత్రం ప్రజలను కలవకుండా ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు.
డిసెంబర్ 20నుంచి సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలు
సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభల గోడపత్రికలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాదర్బార్ నిర్వహించని సీఎం