పన్ను వసూళ్లలో పటిష్ఠమైన విధానాలతో రాష్ట్ర రాబడులు పెంచేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పన్ను ఎగవేతకు అవకాశంలేకుండా వివిధ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బడ్జెట్ పద్దులపై రెండో రోజు శుక్రవారం కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పాల్గొన్నారు.
పన్ను రాబడి పెరగాలి: సీఎం కేసీఆర్
బడ్జెట్ పద్దులపై ఆర్థిక శాఖ అధికారులతో పాటు జీఎస్టీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ రాబడులు తగ్గడం, ఆర్థిక మాంద్యం ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. పన్ను ఎగవేతకు అవకాశంలేకుండా వివిధ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రెండో రోజు అధికారులతో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష
జీఎస్టీ, అమ్మకం పన్ను ఆదాయంపై సమీక్షించి.. పన్ను రాబడులు అంచనాల మేరకు లేకపోవడంపై చర్చించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రాబడులపై ఉన్న మాట వాస్తవమే అయినా.. పటిష్ఠ విధానాలతో ముందుకెళ్లాలని.. పన్ను చెల్లించకుండా జరిగే వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బకాయిల వసూళ్లు, పెండింగ్ వివాదాల పరిష్కారం ద్వారా పన్ను రాబట్టడం, ఎగవేత నివారణ తదితర అంశాలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు.
ఇవీచూడండి:మానవత్వాన్ని చాటుకున్న రాచకొండ సీపీ
Last Updated : Feb 29, 2020, 7:59 AM IST