సీఎం సమీక్ష.. లాక్డౌన్పై కీలక నిర్ణయం! - CM review with ministers and officials at 3 pm
13:09 May 27
సీఎం సమీక్ష.. లాక్డౌన్పై కీలక నిర్ణయం!
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్లో సీఎం సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు వలసకూలీల్లోనూ పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు విషయమై సీఎం సమీక్షిస్తున్నారు.
సడలింపులు, హైదరాబాద్లో దుకాణాలు, ఆర్టీసీ బస్సుల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాల చెల్లింపు వినతులపై కూడా చర్చించే అవకాశం ఉంది. వర్షాకాలం సీజన్ ప్రారంభం నేపథ్యంలో ఎరువులు, విత్తనాల లభ్యత సహా ఇతర అంశాలపై సమీక్షిస్తారు. రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.