తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి' - Cm kcr review with adilabad mlas

'ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి'
'ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి'

By

Published : Dec 28, 2020, 6:24 PM IST

Updated : Dec 28, 2020, 6:56 PM IST

18:22 December 28

'ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి'

ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టులపై జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఛనాక-కొరాట బ్యారేజీ, పంప్ హౌస్, కెనాళ్లను జూన్‌లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను సత్వరమే పూర్తిచేయాలన్నారు.

ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు ఆయకట్టు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కుప్పి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సూచించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లు పిలిచి పనులు చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వానాకాలంలోగా పూర్తిచేయాలని సూచించారు. వర్ధన్నపేట పరిధి కోనారెడ్డి చెరువుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు.  

పరకాల పరిధి కోనాయమాకుల పథకంలో మిగిలిన పనులను పూర్తిచేయాలని తెలిపారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టి వెంటనే సర్వే నిర్వహించాలని వెల్లడించారు.  హుజూర్‌నగర్‌కు సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు. వర్షాలతో దెబ్బతిన్న చెరువులకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

ఇదీ చూడండి:నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష... కీలక నిర్ణయాలు

Last Updated : Dec 28, 2020, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details