తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిషత్‌లకు నిధులు, విధులు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్‌ - cm kcr latest news

గ్రామ పంచాయతీల తరహాలోనే జిల్లా, మండల పరిషత్‌లకూ నిధులు కేటాయించి, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని తెలిపారు.

పరిషత్‌లకు నిధులు, విధులు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్‌
పరిషత్‌లకు నిధులు, విధులు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్‌

By

Published : Feb 9, 2021, 5:45 AM IST

మండల, జిల్లా పరిషత్‌లను బలోపేతం చేసి.. స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ధిలో వాటిని క్రియాశీలం చేస్తామని.. సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాయతీల తరహాలోనే వీటికీ వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించి, స్పష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. పంచాయతీలు తమ నిధులను... పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టామన్న కేసీఆర్... అయితే కొన్ని చోట్ల రెండు లక్షలు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే... పాత నిబంధన అమలు చేస్తున్నారన్నారు. ఇది కొత్త చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే... పంచాయతీల నిధులను వినియోగించుకునే అధికారం... కొత్త పంచాయతీ రాజ్ చట్టం కల్పించిందన్న కేసీఆర్.. దాన్ని సమర్థంగా అమలుచేయాలని సూచించారు.

ఆర్థిక సంఘం నిధులు..

స్థానిక సంస్థల బలోపేతానికి పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. నిధుల కొరత లేకపోవడంతో.... పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి... గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపుయార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలు సమకూరాయని చెప్పారు. ఇదే తరహాలో.. జిల్లా, మండల పరిషత్‌లకూ ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని తెలిపారు. నిధులు ఇవ్వడంతో పాటు... జిల్లా, మండల పరిషత్‌లకు నిర్దిష్టమైన విధులు అప్పగించాలన్న కేసీఆర్... ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో సూచించాలని అధికారులను కోరారు. అధికారుల సూచనలపై... జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లతో స్వయంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details