రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష... వేతనాల్లో కోత - సీఎం కేసీఆర్

20:47 March 30
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష... వేతనాల్లో కోత
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ రకాల వేతనాల చెల్లింపులపై కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం,అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం ,మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించారు.
నాల్గో తరగతి, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం... అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం, నాల్గో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 10 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.