CM Revanth Reddy warns on Drugs and Fake seeds : రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదం వినిపించేందుకు వీల్లేదని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) స్పష్టం చేశారు. చిన్న చిన్న పట్టణాలు, పాఠశాలల్లోనూ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయన్నారు. పంజాబ్ వంటి పరిణామాల వైపు తెలంగాణ వెళ్తోందని, ఇది ప్రమాదకరమని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Meeting Today :డ్రగ్స్‌పై సమాచారం కోసం ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు. ఏవోబీ సరిహద్దు నుంచి గంజాయి ఎలా వస్తుందో తెలుసుకోవాలని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించవద్దని పోలీసులకు స్పష్టం చేశారు. పోలీసులకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నామని భూకబ్జాదారులు, డ్రగ్స్ మాఫియా(Drugs), నకిలీ విత్తనాల రాకెట్లను ఉక్కుపాదంతో అణచి వేయాలని సీఎం సూచించారు.
సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్‌గా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ నేరాల తీరు మారి ఇప్పుడు సైబర్ నేరాల వైపునకు వెళ్లాయన్నారు. సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయాలని పోలీసులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కన్నా ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.