తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్​ఎస్​ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్న సీఎం రేవంత్​ - ఖండించిన కేటీఆర్​

CM Revanth Reddy vs KTR About Drugs in Telangana : రాష్ట్రంలో డ్రగ్స్​ వ్యవహారంపై సీఎం రేవంత్​ రెడ్డి వర్సెస్​ కేటీఆర్​ మధ్య వాదనలు జరిగాయి. బీఆర్​ఎస్​ పాలనలోనే గంజాయి, డ్రగ్స్​, మత్తు పదార్థాలు అడ్డాగా రాష్ట్రం మారిందని సీఎం ఆరోపించగా కేటీఆర్​ ఆ వ్యాఖ్యలను ఖండించారు.

CM Revanth Reddy vs KTR
CM Revanth Reddy vs KTR About Drugs in Telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 9:00 PM IST

CM Revanth Reddy vs KTR About Drugs in Telangana :మత్తు పదార్థాలపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ సాగింది. బీఆర్​ఎస్​ పాలనలో గంజాయి, మత్తు పదార్థాలకు, డ్రగ్స్​కు అడ్డాగా మారిందని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. డ్రగ్స్​ కోరల్లో చిక్కుకున్న పంజాబ్​ మాదిరే రాష్ట్రాన్ని తయారు చేశారని ధ్వజమెత్తారు. మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డ్రగ్స్​ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ ఖండించారు. శాసనసభలో గవర్నర్(Governor)​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు విమర్శలు చేసుకున్నారు.

Telangana CM Revanth Reddy Serious About Drugs :ఆనాడు డ్రగ్స్ ఘటనపై సిట్(SIT)​ వేయాలని పోరాటం చేశామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలిపారు. డ్రగ్స్​ కోరల్లో చిక్కుకున్న పంజాబ్​ మాదిరే రాష్ట్రాన్ని తయారు చేశారని విమర్శించారు. డ్రగ్స్​ను అరికట్టేందుకు ఈ ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికతో ముందుకు వెళుతోందని అన్నారు. డ్రగ్స్(Durges)​ విషయంలో ఇకపై ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

"ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్​ గురించి చర్చ లేకుండే. గంజాయి మత్తు లేకుండే. లిక్కర్​ అతి తక్కువగా ఉండేది. కానీ ఈ రోజు ఏ పేపర్​ చూసిన, టీవీ చూసిన గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయి. ఆరేళ్ల బాలికపై గంజాయి మత్తులో అత్యాచారం చేస్తే నాటి ప్రభుత్వం ఏమీ చేయలేదు. పంజాబ్​ మాదిరే తెలంగాణ తయారయ్యింది డ్రగ్స్​ విషయంలో. డ్రగ్స్​ ఘటనపై సిట్​ వేయాలని పోరాటం చేసి హైకోర్టుకు వెళ్లాము. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అంటే జైలుకే. న్యాబ్​ ఏర్పాటు కాగితాలకు పరిమితం అయింది."-రేవంత్​ రెడ్డి, సీఎం

రాష్ట్రంలో డ్రగ్స్​ వాడకంపై సీఎం సీరియస్​ : రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్​, గంజాయి వస్తే సంహించేది లేదన్నారు. వీటి వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. గత ప్రభుత్వం నామమాత్రంగా టీఎస్​ న్యాబ్(TS Nab)​ ఏర్పాటు చేశారని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. న్యాబ్​ ఏర్పాటు కాగితాలకు మాత్రమే పరిమితమైందన్నారు. న్యాబ్​కి సిబ్బంది, నిధులు ఇవ్వలేదని రేవంత్​ రెడ్డి విమర్శించారు.

"టీఎస్​ న్యాబ్​ అనేది ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వం. సీవీ ఆనంద్​ను తీసుకువచ్చి డైరెక్టర్​గా కూర్చోబెట్టాం. పంజాబ్​ గురించి డ్రగ్స్​ విషయంలో మాట్లాడారు. అసలు పంజాబ్​లో మొన్నటి వరకు ఉన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వం. తెలంగాణ డ్రగ్స్​ నివారణకు బీఆర్​ఎస్​ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉంటుంది."-కేటీఆర్​, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

KTR Condemned CM Revanth Reddy Comments : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిన విమర్శలను కేటీఆర్​ ఖండించారు. డ్రగ్స్​ నివారణ కోసం సమర్థులైన అధికారులను నియమించామన్నారు. డ్రగ్స్​ కట్టడి కోసం బీఆర్​ఎస్(BRS)​నే టీఎస్​ న్యాబ్​ ఏర్పాటు చేసిందన్నారు. మత్తు పదార్థాల కట్టడి కోసం ప్రత్యేకంగా అధికారిని నియమించామని వివరించారు. మత్తు పదార్థాల నివారణలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.

బీఆర్​ఎస్​ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్న సీఎం రేవంత్​ - ఖండించిన కేటీఆర్​

ఫామ్‌ హౌస్‌ వడ్లపై విచారణకు సిద్ధమా : రేవంత్ రెడ్డి

'సీఎం రేవంత్​ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'

ABOUT THE AUTHOR

...view details