CM Revanth Reddy Speech in Telangana Legislative Assembly :కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇకనైనా బీఆర్ఎస్లో మార్పు వస్తుందని ఆశించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారకున్నానని, కానీ ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారన్నారు. శాసనసభలో గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే సమావేశంలో సీఎం ప్రసంగించారు.
మా పార్టీ, మా ఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టాక ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. గతంలో ప్రగతిభవన్‌లోకి నాటి హోంమంత్రికి కూడా ప్రవేశం లేదని చెప్పారు. హోంమంత్రిని ఒక హోంగార్డు అడ్డుకుని వెనక్కి పంపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అలాగే ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న సైతం ప్రగతిభవన్ ముందు గంటల కొద్దీ నిలబడ్డారని నాటి విషయాలను గుర్తు చేశారు. ప్రజాభవన్‌కు ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు సీఎంను కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం ఉండలేదన్నారు.
సమీక్షలు, సమావేశాలు, ఆదేశాలు - పాలనపై తనదైన ముద్ర వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana Legislative Assembly Sessions :ఇప్పుడు ఎవరు వచ్చినా, ప్రజల సమస్యలు వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సభలో నిరసన తెలిపినందుకు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్నే రద్దు చేసిందని పేర్కొన్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌లోకి పిలిపంచుకున్నారా అంటూ ప్రశ్నించారు.