CM Revanth Reddy Review Meeting on Praja Palana Applications : సోమవారం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఊహించని స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అలానే దరఖాస్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో నిజమైన అర్హులను ఎలా గుర్తిస్తారు? తరవాత చేసే కంప్యూటరీకరణ ప్రక్రియ ఎలా ఉంటుంది? తదుపరి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీల అమలుపై సోమవారం సచివాలయంలో సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రజాపాలన వెబ్‌సైట్ www.prajapalana.telangana.gov.inను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Telangana Ministers Meeting in Congress Government : సోమవారం ఉదయం 11 గంటలకు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరపనున్నారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన ప్రజాపాలన తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు స్వీకరించగా(Total Praja Palana Applications in Telangana), వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి.
మాది ప్రజాస్వామ్య పాలన - తిరుగుబాటు ఉండదు : డిప్యూటీ సీఎం భట్టి
Ministera and Officials Meeting in Telangana 2024 : ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఫించన్లు రూ.4 వేలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకు సిలిండర్ పథకాలను త్వరలో ప్రారంభించే అంశంపై సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. రైతుబంధు నిధుల విడుదల, ఆదాయం, అప్పుల సమీకరణ, కొత్త రేషన్ కార్డులు, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.