తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంసీఆర్​హెచ్ఆర్డీలోని ఖాళీ ప్రాంగణంలో సీఎం క్యాంప్‌ కార్యాలయం : రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy on MCRHRDI Camp Office : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడంబరాల ఖర్చు చేయబోమని, దుబారాను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంసీఆర్​హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని క్యాంప్ ఆఫీసు కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్ఠాగోష్టిలో రేవంత్ రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy Chitchat
CM Revanth Reddy on MCRHRDI Camp Office

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 6:42 PM IST

Updated : Dec 14, 2023, 10:52 PM IST

CM Revanth Reddy on MCRHRDI Camp Office : బీఆర్‌ఎస్ ప్రభుత్వం 12 నుంచి 14 గంటలకు మించి కరెంట్‌ ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి(cm revanth reddy) పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో మాత్రమే 24 గంటల విద్యుత్‌ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడంబరాల కోసం ఖర్చు చేయబోమని, దుబారా తగ్గిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎంసీఆర్​హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని క్యాంప్ ఆఫీసు కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముగిసిన మంత్రివర్గ సమావేశం - గవర్నర్​ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం

CM Revanth Reddy Chitchat :శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల అజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.హైదరాబాద్‌లో ఉన్న మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలోని ఖాళీస్థలాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాభవన్‌లోని ఆఫీస్‌ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటానని తెలిపిన ఆయన కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టంచేశారు.

మంత్రిమండలి విస్తరణ, ఇతర కీలక పదవుల ఎంపికపై కసరత్తు - దిల్లీ వెళ్లే యోచనలో సీఎం!

శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి వివరించారు. పాత భవనంలోనే కౌన్సిల్ సమావేశాలు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందని చెప్పారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోరైల్‌ ఉపయోగకరంగా ఉండదన్న రేవంత్‌ మరో మార్గంలో ప్రణాళికలు వేయనున్నట్లు వివరించారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు

Last Updated : Dec 14, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details