తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కాన్వాయ్​ వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు - చర్యలకు ఆదేశించిన రేవంత్​ రెడ్డి - ప్రజా సమస్యలపై రేవంత్​ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy on CM Convoy Traffic : సీఎం కాన్వాయ్​ వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్​ ఇబ్బంది కలుగకూడదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి పోలీసు శాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే పోలీస్​ శాఖలోని నియామకాలు, రిక్రూట్​మెంట్​లపై సమీక్ష నిర్వహించారు. వెంటనే హోంగార్డ్ రిక్రూట్​మెంట్ వెంటనే చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy on CM Convoy Traffic

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 10:12 PM IST

Updated : Dec 15, 2023, 10:38 PM IST

CM Revanth Reddy on CM Convoy Traffic :రాష్ట్రంలో తన కాన్వాయ్‌ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసువాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు సూచించారు. సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్‌లో 15 వాహనాలకు బదులు 9 వాహనాలకు కుదించామని అధికారులు తెలియ చేశారు.

తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చూడాలని, ట్రాఫిక్‌(Hyderabad Traffic)ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో తనకు సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం

CM Revanth Reddy Review on Police Department :అలాగే పోలీసు శాఖలోని పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు, నియామకాలపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన మాజీ డీఎస్పీ నళిని(Nalini)కి తిరిగి ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోకూడదని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సీఎం ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్నిగుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాన్ని త్యజించిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకుండాలని అధికారులను ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలన్నారు. ఆమె తిరిగి ఉద్యోగంలో చేరడానికి సుముఖంగా ఉంటే, వెంటనే ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖలో ఆమెను తిరిగి తీసుకునేందుకు నిబంధనలు అడ్డు వచ్చినట్లయితే ఇతర శాఖల్లో ఇచ్చేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రావిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లతో పాటు, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు సూచిస్తూ నివేదికలు ఇవ్వాలని సీఎం తెలిపారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏడెనిమిదేళ్లుగా నిలిచిపోయిన హోంగార్డుల నియామకాలను వెంటనే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణలో హోంగార్డుల సేవలను మరింత వినియోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల ఆర్థిక, ఆరోగ్య అవసరాలు తీరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు, ఆర్టీసీలో ఉన్నతాధికారులు, కార్మికులు, కిందిస్థాయి ఉద్యోగుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేయాలని సీఎం తెలిపారు.

CM Revanth Reddy on Public Grievance : నెలలో రెండు రోజుల పాటు పట్టణ, గ్రామ సభలు నిర్వహించి ప్రజలు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానికంగానే సమస్యలు పరిష్కారమైతే హైదరాబాద్ వరకు వచ్చే అవసరం తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు. నిర్దేశిత గడువులో వేగంగా సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులు, వినతులను డిజిటలీకరణతో పాటు అవి ఏ దశలో ఉన్నాయో ప్రజలకు తెలపాలన్నారు. ప్రజావాణి(Praja Vani)కి అద్భుతమైన స్పందన వస్తున్నందున ఫిర్యాదులు స్వీకరించేందుకు టేబుల్స్ పెంచాలని, మంచినీరు, ఇతర వసతులకు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజావాణికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు నిర్దిష్ట సమయం కేటాయించి, ప్రత్యేక పాసులు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం తెలిపారు.

ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం రేవంత్​ రెడ్డి - అక్కడి కార్యకలాపాలపై ఆరా

టీఎస్​పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ : సీఎం రేవంత్​ రెడ్డి

Last Updated : Dec 15, 2023, 10:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details