Revanth Reddy Launch Mahalakshmi Scheme Today : కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఆవరణలో ఆరు గ్యారెంటీల్లోని రెండు పథకాలైన మహలక్ష్మి, చేయూత పథకాల్ని సీఎం ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులతో కలిసి సీఎం అందుబాటులోకి తెచ్చారు.
తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు - ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే?
TSRTC Free Bus Service Women in Telangana : సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను ప్రారంభిస్తున్నాన్న రేవంత్‌రెడ్డి మహిళలు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంతో(Mahalakshmi scheme) పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10లక్షలకు పెంచే చేయూత పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
ఇటీవల ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం, శాసనసభ ఆవరణలోనే రెండు గ్యారంటీల అమలు ప్రారంభోత్సవం నిర్వహించారు. ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లోగోను మంత్రులు, అధికారులతో కలిసి ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ సాయాన్ని 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ చేయూత పథకాల్ని అమల్లోకి తెచ్చారు.
అసెంబ్లీలో తొలిరోజు 100 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - బీజేపీ సభ్యుల గైర్హాజరు