CM Revanth Reddy Inspects Assembly Hall : పార్లమెంట్ నూతన భవనాల తరహాలోనే రాష్ట్రంలోనూ అసెంబ్లీ(Telangana Assembly)కి కొత్త భవనాలు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), శాసనసభ ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించారు. శాసనసభ ఉన్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయవచ్చో, ఇప్పుడున్న వాటిలో ఏమేం మార్పులు చేయాలో సీఎం అధికారులతో చర్చించారు. దిల్లీలో పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు(Assembly Buildings) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇవాళ స్పీకర్ పదవి కోసం గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad Kumar) నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు అసెంబ్లీ ప్రాంగణం అంతా కలిసితిరిగారు.
సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలి : భట్టి విక్రమార్క
CM Revanth Reddy Visit Assembly: మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(MLC Chairman Gutta), శాసనసభ కార్యదర్శి నర్సింహచార్యులతో కలిసి కాలినడకన తిరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని భవనాలను పరిశీలించారు. మొత్తం విస్తీర్ణం ఎంత? ఏమే కట్టడాలు ఉన్నాయి. అందులో పురాతన భవనాలుఏమి ఉన్నాయి. కొత్తగా నిర్మితమైనవి ఏమున్నాయి తదితర వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. కలగూర గంపగా ఉన్న అసెంబ్లీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు స్థల పరిశీలన చేశారు.
మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు