CM Revanth Reddy Inaugurated Nampally Numaish Exhibition : నగరవాసులను అలరించేందుకు నుమాయిష్ 2024 వచ్చేసింది. వివిధ రకాల స్టాళ్లతో నగరవాసులకు అందుబాటులో ఉండనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
Numaish Exhibition in Hyderabad: నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకువస్తోందన్నారు. ఇందులో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. నుమాయిష్(Numaish Exhibition) కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. నగరవాసులతో పాటు అందర్నీ అలరించేందుకు నుమాయిష్ సిద్ధమైందని, ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని విజ్ఞాప్తి చేశారు.
మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
"హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తోంది. నుమాయిష్‌లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయం. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
Numaish Exhibition Details : గత 82 ఏళ్లుగా నుమాయిష్ ప్రదర్శన కొనసాగుతోందని, ప్రస్తుతం 83 వ ఏడాదని నిర్వాహకులు తెలిపారు. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టాళ్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాల్గొంటారని అన్నారు. ఇందులో ప్రవేశానికి రూ.40 రుసుము ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా భద్రత చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.