CM Revanth Reddy Gave Two Crores Check to Nikhat Zareen :వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు (Nikhat Zareen)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల చెక్ అందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిఖత్‌కు ఈ చెక్ అందజేశారు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ సన్నద్ధత కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తాన్ని అందజేశారు. నిఖత్ భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు.
ఇటీవల నిర్వహించిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ పసిడిని కైవసం చేసుకున్నారు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టారు. దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించారు.
'నిజామాబాద్ పేరును ప్రపంచానికి చాటిచెప్పినందుకు చాలా గర్వంగా ఉంది'