CM Revanth Reddy Focus on Officials Transfers :త్వరలో రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా అధికారుల వివరాలు, సర్వీస్ రికార్డులు, ఇంటెలిజెన్స్ రిపోర్టులను(Intelligence Report) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. భారీ ఎత్తున జరగనున్న ఈ బదిలీలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) కసరత్తు చేస్తున్నారు.
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - నిషేధిత జాబితాతో పాటు పలు అంశాలపై నివేదికకు ఆదేశం
ఇప్పటి వరకు కేవలం కొద్ది మంది అధికారులకు మాత్రమే పోస్టింగులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ మిగతా వాటి విషయమై విస్తృత కసరత్తు చేస్తున్నారు. తన కార్యాలయంలోనూ మరో ఇద్దరు లేదా ముగ్గురు కార్యదర్శులను నియమించుకోవడంతో పాటు కార్యదర్శులు(Secretaries), హెచ్ఓడీల పోస్టింగులు చేపట్టాల్సి ఉంది. కొన్ని పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరికొన్ని పోస్టింగుల్లో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ దిశగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.
CM Revanth Reddy Review Meeting For Officials Postings : ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన అంశాలపైనే చర్చించినట్లు సమాచారం. త్వరలోనే కొన్ని పోస్టింగులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు.