ప్రజాదర్బార్‌కు భారీ స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్ ట్వీట్ CM Revanth Reddy First Praja Darbar at Praja Bhavan : అధికారంలోకి రాగానే మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ప్రగతిభవన్‌ను జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పిన విధంగా ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. సీఎం రేవంత్ పిలుపుతో వినతులతో ప్రజాభవన్‌కు ప్రజలు పోటెత్తారు. క్యూలైన్ల ద్వారా వచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను రేవంత్ సావధానంగా అడిగి తెలుసుకున్నారు.
సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్ రెడ్డి
ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గంట సేపు ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించిన సీఎం విద్యుత్‌శాఖపై అధికారులతో సమీక్ష ఉన్నందున ఆ బాధ్యతలను మరో మంత్రి సీతక్కకు అప్పగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు.
Praja Darbar in Jyothirao Phule Bhavan : మొదటి రోజు ప్రజాదర్బార్‌పై(Praja Darbar) సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన రేవంత్‌రెడ్డి జనం కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగిందని వివరించారు. జనం నుంచి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుందని ట్విట్లో పేర్కొన్నారు.
రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు - ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
సీఎంకు తమ సమస్యలపై వినతులు అందజేసిన వివిధ వర్గాల ప్రజలు ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎక్కువగా ఇళ్లు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, ఒప్పంద కార్మికుల జీతాల పెంపు సహా వివిధ రకాల వినతులు వెల్లువెత్తాయి. ప్రజా దర్బార్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు అర్జీలను నమోదు చేసి తక్షణ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
"ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడం శుభపరిణామం. మేము ఇన్నాళ్లుగా పడుతున్న గోసకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే భరోసా దొరికింది. మేము ఇంతకు ముందు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నాము. ఇప్పుడు నేరుగా సీఎం చొరవ తీసుకుని పరిష్కారిస్తారని భావిస్తున్నాము". - ప్రజలు
"కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాము. వేల సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నారు. సమస్యలపై అధికారులు దర్యాప్తు చేసి పరిష్కారిస్తారు".- మల్లురవి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
Praja Darbar in Praja Bhavan : వైద్యసేవల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. తాము ఇన్నాళ్లు పడ్డ గోసకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే భరోసా దొరికిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాదర్బార్‌కు వికలాంగులు, వృద్దులు, మహిళలు వేలాదిగా తరలివచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం కలగనుందనే ఆకాంక్ష బాధితుల్లో కనిపించింది.
ప్రజలకు జవాబుదారిగా ఉండడమే ప్రజాదర్బార్ నిర్వహణ ముఖ్య ఉద్దేశమని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలనను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. జనం నుంచి వస్తున్న ఆదరణ దృష్ట్యా ప్రజాదర్బార్ నిరంతరం నిర్వహిస్తామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ