CM Revanth Reddy Delhi Tour Today : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో ఆయన హస్తిన పర్యటన సాగుతోంది. ముందుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో(Lok Sabha Speaker Om Birla) సమావేశం కానున్నారు. అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నారు.
ప్రజాదర్బార్‌కు విశేష స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్ ట్వీట్
పార్లమెంటు సభ్యత్వారని రేవంత్ రెడ్డి రాజీనామా : దిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను వ్యక్తిగతంగా కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించనున్నారు. అనంతరం ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆయనతో భేటీ అయిన అనంతరం తిరిగి హైదరాబాద్బయలుదేరి రానున్నారు.
CM Revanth Reddy Released Open Letter : సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, దిల్లీలో తన ఎంపీ(Member of Parliament) పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్‌గిరి అని పేర్కొన్నారు. ఈ రోజు మీ రేవంతన్న సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగురువేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్గిరిలోనేనని అంటూ ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా చెప్పుకొచ్చారు.