CM Revanth Reddy Davos Tour Today : రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం దావోస్ వెళ్లింది. నేటి నుంచి ఈనెల 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సును రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే వేదికగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర బృందం వెళ్లింది.
CM Revanth Visits Davos Today :పర్యటనలో సుమారు 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమై చర్చించనున్నారు. నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలువనున్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ భేటీ కావడంతో పాటు సీఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో చర్చించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్‌తో సీఎం బృందం సమావేశం కానుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం - రేపటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటన
CM Revanth Reddy Davos On Investment Deals :సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్‌రెడ్డి, భద్రతా అధికారులు తఫ్సీర్ ఇక్బాల్, చక్రవర్తి, సహాయకుడు ఉదయ్ సింహా దావోస్ వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో జరగనున్న చర్చగోష్టిలో పురోగమిస్తున్న వైద్యరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు.