రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ దావోస్ వేదికగా రూ. 37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు CM Revanth Reddy Davos Tour Live News Today 2024 :దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) బృందం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు నాలుగు కీలక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 12 వేల 400 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది.
దావోస్‌లో పెట్టుబడుల వేట షురూ- హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రానికి ఒప్పందం
CM Revanth Gautam Adani Meeting Davos :అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో 5 వేల కోట్ల రూపాయలతో 1350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీగూడంలో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ 1400 కోట్ల రూపాయలతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంటు పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయిదారేళ్లలో ప్లాంటు పూర్తయ్యాక సుమారు 4వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది.
అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదనకు గౌతం అదానీ అంగీకరించారు. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు కొనసాగిస్తామని. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగున్నాయని అదానీ పేర్కొన్నారు.
JSW Investments in Telangana : రాష్ట్రంలో 9వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంస్థ 9 వేల కోట్ల రూపాయలతో పంపు స్టోరేజీ ప్రాజెక్టును చేపట్టనుంది. దావోస్‌లో(Davos WEF 2024) జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య చర్చల అనంతరం ఒప్పందాలు జరిగాయి. 5వేల 200వేల కోట్లతో డేటాసెంటర్ల ఏర్పాటుకి ఐరన్ మౌంటెయిన్‌గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 12వందల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న వెబ్ వెర్క్స్ మరో 4వేల కోట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి.
Davos Investments in Telangana : లిథియం, సోడియం బ్యాటరీల తయారు చేసేందుకు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. సుమారు 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఆ సంస్థ సీఈవో మహేష్ గోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దావోస్ లో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో గంటకు 12.5 గిగా వాట్ల సామర్థ్యంతో సెల్‌లు తయారీ సంస్థను నెలకొల్పి అయిదేళ్లలో సుమారు 6 వేల ఉద్యోగాలు కల్పిస్తామని గోడీ కంపెనీ వెల్లడించింది. ఎలక్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సమగ్ర విధానం రూపొందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజెన్ 2 వేల కోట్ల రూపాయలతో మల్లాపూర్‌లోని పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆరాజెన్ కంపెనీ సీఈవో మణి కంటిపూడి సమావేశమయ్యారు. అయిదేళ్లలో 2వేల కోట్ల రూపాయలతో మల్లాపూర్ లో ఔషధ పరిశ్రమ విస్తరిస్తామని, దానివల్ల సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజెన్ సీఈవో తెలిపారు.
విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వరంగల్, ఇతర ప్రాంతాలకు విప్రో(Wipro) విస్తరణతో పాటు రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టాటా సన్స్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్, హెయినెకెన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను వివరించారు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి