తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి - సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Reddy Chit Chat : మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయలేదని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గంతో పోలిస్తే దూరం తగ్గేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని మీడియా చిట్​ చాట్​లో పేర్కొన్నారు.

CM Revanth Reddy on Hyderabad Metro
CM Revanth Reddy Chit Chat

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 4:15 PM IST

Updated : Jan 1, 2024, 5:23 PM IST

CM Revanth Reddy Chit Chat: మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నానని తెలిపారు. విమానశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలతో పోలిస్తే దూరం తగ్గేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. బీహెచ్ఈ​ఎల్​ నుంచి విమానశ్రయం వరకు 32 కిలోమీటర్లు వస్తుంది. కొత్తగా విమానశ్రయానికి ప్రతిపాదించే లైన్లను రేవంత్​ రెడ్డి తెలిపారు.

  • ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు
  • నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయణ గుట్ట దగ్గర విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్​కి లింక్
  • మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు పొడిగింపు(అవసరమైతే)
  • మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగింపు(అవసరమైతే)

CM Revanth Reddy on Hyderabad Metro: గచ్చిబౌలి నుంచి ఎయిర్​పోర్ట్​కి మెట్రోలో వెళ్లేవారు తక్కువగా ఉంటారని రేవంత్​ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో లైన్ల(New Metro Lines in Hyderabad) నిర్మాణాలకు గత సర్కార్​ కంటే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. ఫార్మాసిటీని విడతల వారీగా ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా జీరో కాలుష్యంతో క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి గృహనిర్మాణం కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉండనున్నాయని వివరించారు.

త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy on Skill Development : యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని రేవంత్​తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్​పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని స్పష్టం చేశారు. 100 పడకల ఆస్పత్రి ఉన్న వైద్యశాలలో నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్​పవర్​ను ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని వివరించారు.

CM Revanth Reddy Clarity on Nominated Posts: ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని రేవంత్​ తెలిపారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్​లుగా బాధ్యతలు అప్పగించామన్నారు. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు(Congress Nominated Posts) భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టాాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ- విధి విధానాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం

CM Revanth Reddy on Journalist Problems : ప్రెస్ అకాడమీ(Press Academy) ఛైర్మన్ పదవిని భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్​ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించానని గుర్తు చేశారు. వారికీ అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేసుకుంటారని పేర్కొన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించే బాధ్యత తనదన్నారు. అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా చూస్తామన్నారు. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి ఉండదన్నారు.

'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'

రాష్ట్ర ఆర్థికశాఖపై సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష - '2024-25 బడ్జెట్​లో వాస్తవాలు ప్రతిబింబించాలి'

Last Updated : Jan 1, 2024, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details