CM Revanth Reddy Agreement with Adani Group in Davos: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో సహా అతని బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటనలో బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్తలతో రాష్ట్ర పెట్టుబడుల గురించి చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అవసరాలను, అనుకూలతలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ అయిన అదానీ గ్రూప్‌తో కీలక ఒప్పందం జరిగింది. రూ. 12,400 కోట్లకు పైగా అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీలతో 4 అవగాహన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
- గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.5000 కోట్లు
- డేటా సెంటర్ విభాగంలో రూ.5000 కోట్లు
- ఏరోస్పేస్ అండ్ రక్షణ విభాగంలో రూ.1000 కోట్లు
- అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్లో రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎమ్ఓయూలు కుదిరాయి.
భారీ పెట్టుబడులే టార్గెట్ - నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన
Adani Investment in Telangana: అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో రూ.5000 కోట్లతో 100 మెగా వాట్ల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో రూ.5 వేల కోట్ల 1350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీ గూడంలో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ రూ.1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంటు పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయిదారేళ్లలో ప్లాంటు పూర్తయ్యాక సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో రూ.1000 కోట్లు పెట్టుబడిపెట్టనుంది. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి(Gowtham Adani) సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగున్నాయని అదానీ పేర్కొన్నారు.