CM Revanth New Year Wishes 2024 :నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగిపోయాయని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2024ను 'రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాని సీఎం రేవంత్ వెల్లడించారు.
కళ్లు చెదిరే సెలబ్రేషన్స్‌తో 2024కు స్వాగతం- ఈ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!
Bhatti New Year Wishes 2024 :రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. 2024లో ప్రతి ఇంటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని భట్టి ఆకాంక్షించారు. అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుంది హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.