CM Revanth meet Tata Technologies Representatives :రాష్ట్రంలో ఐటీఐలలో కోర్సుల రూపురేఖలు మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఐటీఐలలో సుమారు రూ.1500 నుంచి రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
డిమాండ్ ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించడానికి 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తుంది. అత్యాధునిక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇద్దరు మాస్టర్ ట్రైయినర్లను కూడా టాటా టెక్నాలజీస్(Tata Technologies) అందిస్తుంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రొబోటిక్స్, సీఎన్‌సీ మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యాన్ని అందించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది.
Tata Technologies Skill Development :ఈ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందించనుంది. టాటా టెక్నాలజీస్ ప్రతిపాదనలకు సీఎం అంగీకరించారు. టాటా టెక్నాలజీస్‌తో ఎంఓయు కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కోరారు. సుమారు లక్ష మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు.