CM KCR: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. తరతరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురౌతున్న దళిత సమాజాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
CM KCR: 'జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది' - cm kcr news
CM KCR: దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్ రామ్ అంటూ సీఎం కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.
![CM KCR: 'జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది' CM KCR: 'జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14930131-981-14930131-1649113392457.jpg)
CM KCR: 'జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది'
బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. తద్వారా సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని సీఎం కేసిఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: Minister Harish Rao Review: 'ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి'