తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్​కు బిహార్ సీఎం ఫోన్... తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వినతి - రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల వార్తలు

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ పదవి కోసం పోటీలో ఉన్న తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

cm-nitish-kumar-call-to-cm-jagan-over-rajya-sabha-deputy-chairman-election
ఏపీ సీఎంకు బిహార్ ముఖ్యమంత్రి ఫోన్... తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వినతి

By

Published : Sep 11, 2020, 7:19 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం రాత్రి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ పదవి కోసం పోటీలో ఉన్న తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నితీశ్ కోరినట్లు తెలిసింది. రాజ్యసభలో వైకాపాకు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనుండగా.. తొలిరోజే డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని సీఎం జగన్​ను నితీశ్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details