వలస కార్మికులు సొంత ప్రాంతానికి వెళ్లడానికి రైళ్లు సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికుల కోసం రైలు సౌకర్యం కల్పించాలని... రైలు వసతి లేని వారిని బస్సుల ద్వారా తరలించాలని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత మాది: కేసీఆర్ - cm kcr on migrant workers
ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లడానికి రైలు, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎస్‌కు సూచించారు.
మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత మాది: కేసీఆర్
కార్మికులెవరు నడిచి పోవాలనే ఆలోచన చేయవద్దని కోరిన ముఖ్యమంత్రి... వారిని సొంత ప్రాంతాలను చేర్చే బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి:అక్టోబర్‌లోగా ప్యాకేజీ-9 ద్వారా సిరిసిల్ల జిల్లాకు సాగునీరు