ఈరోజు ఉపరాష్ట్రపతి(Vice president) వెంకయ్య నాయుడు( venkaiah naidu) పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతికి సీఎం కేసీఆర్(cm kcr).. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజం, దేెశం పట్ల వెంకయ్య నాయుడు అంకితభావంతో సేవలు చేశారని కేసీఆర్ కొనియాడారు. ఆయన సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి దేశానికి సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు.
కిషన్ రెడ్డి విషెస్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy).. వెంకయ్యనాయుడికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. నిస్వార్థంగా, నిబద్ధతతో దేశానికి ఉపరాష్ట్రపతి సేవలందిస్తున్నారని, ఆయన సేవలు దేశానికి అవసరమని ట్విట్టర్ ద్వారా కిషన్ రెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు శుభాకాంక్షలు
ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు(chandrababu naidu).. ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదనానికి నిండైన రూపంగా భాసిల్లుతూ.. ఏ స్థాయిలో ఉన్నా తెలుగువారి శ్రేయస్సుకు, తెలుగు భాష అభివృద్ధికి వెంకయ్య నాయుడు కృషిచేశారని చంద్రబాబు కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:భూముల విలువ పెంపుపై కసరత్తు ప్రారంభం