ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అడుగంటిన జలాలను తిరిగి సమకూర్చే దిశగా సాగు, తాగునీటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూ ఉపరితల జలాల లభ్యతను పెంచుతూ జల పునరుజ్జీవన చర్యలు చేపడుతున్నామని వివరించారు.
ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్రంలో అడుగంటిన జలాలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూ ఉపరితల జలాల లభ్యతను పెంచుతున్నామని వివరించారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని గడప గడపకూ అందిస్తున్నామని... తాగునీటి కష్టాలు తీర్చి ఫ్లోరైడ్ వంటి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపిందన్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠ చర్యల ద్వారా రాష్ట్ర జల వనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహా ప్రపంచ జల వనరుల నిపుణులు రాష్ట్రంలో జరుగుతున్న జల పునరుజ్జీవన కార్యక్రమాలను కొనియాడుతుండటం గర్వకారణమని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో నిరంతరం నీటి సరఫరాకు ప్రణాళికలు: కేటీఆర్