తెలంగాణ

telangana

ETV Bharat / state

cm kcr: భవిష్యత్ తెలంగాణ యువతదే.. - అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్​

భవిష్యత్తులో అన్ని రంగాల్లో యువతతే కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు.. సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు.

cm kcr
cm kcr

By

Published : Aug 12, 2021, 4:01 AM IST

రానున్న రోజుల్లో రాష్ట్రంలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతోందని సీఎం కేసీఆర్​ అన్నారు. భవిష్యత్ తెలంగాణ యువతదేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం... శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి, యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు, బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు.

ఉపాధి కోసం మార్గాల అన్వేషణ

యువత భవిష్యత్తు కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ వంటి రంగాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని కేసీఆర్ అన్నారు. ఉపాధికి అవకాశం ఉన్న పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని తెలిపారు. స్వయంఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం

శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమల్లోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామని తెలిపారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇదీ చూడండి:Highcourt: 'ఆ జీవో తప్పుదోవ పట్టించేలా ఉంది'

ABOUT THE AUTHOR

...view details