తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజారోగ్య వైద్యంలో గుణాత్మక పురోగతి: సీఎం కేసీఆర్

Cm Kcr On Wolrd Health Day: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR
CM KCR

By

Published : Apr 6, 2022, 9:32 PM IST

Cm Kcr On Wolrd Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌... రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో కృషి చేస్తోందన్నారు. ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాలలో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక పురోగతి సాధిస్తోందని చెప్పారు. రాష్ట్ర నలుమూలలా వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తుండడం ప్రభుత్వ చిత్తశుద్ధికి దార్శనికతకు అద్ధం పడుతున్నాయని తెలిపారు.

ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచిందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ రూపొందించి ఆరోగ్య తెలంగాణ కోసం బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌ నియంత్రణ కూడా ప్రభుత్వ సమర్ధతకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణలో దేశంలోనే 3వ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న రాష్ట్ర విద్యార్థులకు మేలు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details