Hospitals in Hyderabad: హైదరాబాద్‌లో నలువైపుల నిర్మించనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఈనెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే టిమ్స్ మాదిరిగా మరో 3 ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఆస్పత్రులకు అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ విద్యకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు ఆస్పత్రులకు ఇప్పటికే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్లలో 2 వేల 679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం చేసేందుకు వైద్యారోగ్యశాఖ పరిపాలనపరమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్బీనగర్ ఆస్పత్రికి రూ.900కోట్లు, సనత్ నగర్ ఆసుపత్రికి రూ.882 కోట్లు, అల్వాల్ ఆస్పత్రికి రూ.897 కోట్లు నిధులు కేటాయించింది.