తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయాలు తెరాస సొంతం' - Trs latest upadates

సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దిల్లీలో తెరాస కార్యాలయం భూమి పూజ నిర్వహించనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. తెరాస అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

KTR
కేటీఆర్‌

By

Published : Aug 24, 2021, 5:43 PM IST

Updated : Aug 24, 2021, 6:11 PM IST

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం తెరాస(TRS)దే అని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister ktr) స్పష్టం చేశారు. తెరాస అధినేత కేసీఆర్‌ (Kcr) అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెరాస రాష్ట్ర కమిటీ నిర్ణయాలను వెల్లడించారు.

సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దిల్లీలో తెరాస కార్యాలయం భూమి పూజ నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 32 జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాలను కేసీఆర్‌ అక్టోబర్‌లో ప్రారంభిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభం చేపట్టనున్నట్లు వివరించిన కేటీఆర్... సెప్టెంబర్‌లోనే జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెరాస సర్కారు విజయాలను కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో తెరాస ద్విదశాబ్ది ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో హైదరాబాద్, వరంగల్ మినహాయిస్తే... అన్ని జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం దాదాపుగా 24, 25 చోట్ల పూర్తయింది. మిగతాచోట్ల పనులు 90 శాతం పూర్తయ్యయాయి. పార్టీ జిల్లా కార్యాలయాలను అక్టోబర్​ మాసంలో ప్రారంభించాలనే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారు. విజయదశమి నాటికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాల ప్రారంభం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష కాబట్టి... తెలంగాణకు రక్ష... తెలంగాణకు పర్యాయపదం టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేవలం జిల్లాల్లోనే కాకుండా దిల్లీలో పార్టీ కార్యాలయానికి సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారు.

-- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR: 'తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయాలు తెరాస సొంతం'

ఇదీ చూడండి: కేసీఆర్ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కమిటీ భేటీ

Last Updated : Aug 24, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details