ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ సమస్యపై చర్చించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమావేశం కానున్నట్లు సాగునీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు.
కర్ణాటక సీఎంతో త్వరలో కేసీఆర్ భేటీ! - cm kcr meet with karnataka cm
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో సీఎం కేసీఆర్ త్వరలో సమావేశమవ్వనున్నారు. ఈ భేటీలో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ సమస్యలపై చర్చించనున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత హెడ్‌వర్క్స్ నుంచి నీటి తరలింపు అంశం మూడు రాష్ట్రాల పరిధిలోకి వెళ్లింది. ఆర్డీఎస్ ద్వారా కర్ణాటకలోని 5,700 ఎకరాలకు, రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ మూడు దశాబ్దాలుగా అలంపూర్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు మించి సాగు నీరు అందడం లేదు. దీనికి ప్రధాన కారణం హెడ్‌వర్క్స్ పరిధిలోని స్లూయిజ్ రంధ్రాల గొడవ. స్పిల్‌వే గోడకూ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
ఇదీ చదవండి:'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం'