తెలంగాణ

telangana

ETV Bharat / state

సమగ్ర వ్యవసాయ విధానంపై రేపు సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సమావేశం - 21న వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష

నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్​ అధ్యక్షతన గురువారం సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. పంటల మ్యాప్‌పై సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి.. ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.

cm-kcr-will-conduct-review-on-agriculture-department-on-21-may
సమగ్ర వ్యవసాయ విధానంపై రేపు సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సమావేశం

By

Published : May 20, 2020, 11:37 PM IST

తెలంగాణలో అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు విధానాన్ని... ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండింటి నుంచి ప్రగతిభవన్‌లో జరగనున్న సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు పాల్గొంటారు.

తెలంగాణలో ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలన్న విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి.. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలనే అంశాలపై గత రెండు రోజులుగా వ్యవసాయ శాఖ చర్చించి జిల్లాల వారీ పంటల మ్యాప్‌ రూపొందించినట్లు సమాచారం. ఈ మ్యాప్‌పై గురువారం జరిగే సమావేశంలో చర్చించనున్న కేసీఆర్​... జిల్లాల వారీ సాగు చేయాల్సిన పంటలను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా

ABOUT THE AUTHOR

...view details