రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ తరచూ గంజాయి పట్టివేత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి (Growing ganja sales in Hyderabad). ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా... నిత్యం మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో గంజాయి విక్రయం, సరఫరా పెరగడంతో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి... హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి భారీ వాహనాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాలు... హైదరాబాద్ మీదుగా పుణె, నాందేడ్, ముంబయి, అహ్మద్‌నగర్, బెంగళూరు, రాయిచూర్, బీదర్‌కు తరలిస్తున్నారు. తాజాగా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు డీసీఎంలో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముసారాంబాగ్‌లో పట్టుకున్నారు.
పదుల సంఖ్యలో కేసులు.. వందల కేజీల స్వాధీనం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ధూల్‌పేట్, మంగళ్‌హాట్, గోల్కొండ, మణికొండ, లంగర్‌హౌజ్, సింగరేణి కాలనీ, తార్నాక, లాలాగూడ, సికింద్రాబాద్, అంబర్‌పేట్, నాంపల్లిలోని పలు కాలనీల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసి కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేవలం నెల వ్యవధిలోనే 78 గంజాయి కేసుల్లో 121మందిని అరెస్ట్ చేశారు. 14 వందల కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23మంది గంజాయి విక్రేతలపై పీడీ చట్టం ప్రయోగించారు. కేసు విచారణలో భాగంగా వెళ్లిన నల్గొండ పోలీసులపై ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్ల దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.
జైలుకెళ్లొచ్చాక కూడా అదేపని..