Mlc kavitha ashta lakshmi temple karthika pooja: హైదరాబాద్ కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక శుక్రవారం సందర్భంగా ఆలయానికి వచ్చిన కేసీఆర్ సతీమణి శోభ, కవిత, మంత్రి సబితాకు... అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.
సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత పూజలు కవిత కార్తిక పౌర్ణమి పూజ..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) ఇంట కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని తన ఇంట్లో.. కుటుంబ సభ్యులతో కలిసి కవిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తులసి కోట వద్ద దీపాలు వెలిగించి.. హారతులు పట్టారు.
అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్సీగా ఏకగ్రీవం..
నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత బరిలో దిగగా.. ఆ స్థానం ఏకగ్రీవమైంది. ఎకగ్రీవంగా ఎన్నికైనట్టు ఇవాళ కల్వకుంట్ల కవిత ధ్రువపత్రాన్ని తీసుకోనున్నారు. అఫిడవిట్లో తప్పుల కారణంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీలో లేకుండా పోవటం వల్ల... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నుంచి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవమయ్యారు. మంగళవారం(నవంబర్ 23) రోజున తెరాస అభ్యర్థి కవిత నామినేషన్ వేయగా.. ఆమెకు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీల తరఫున కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. సాయంత్రం తర్వాత ఆ నామినేషన్లో మద్దతిచ్చినట్లు పేర్లున్న ఎంపీటీసీ నవనీత, కార్పొరేటర్ రజియా సుల్తానా.. మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై ఆసక్తి ఏర్పడింది.
అష్టలక్ష్మి ఆలయంలో సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత పూజలు ఉత్కంఠ ఎందుకు?
ఈ పరిణామాల మధ్య రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో ఉత్కంఠ వీడిపోయింది. అయితే ఆరోపణలు చేస్తున్న వారి ఓటర్ కార్డు ఉందని.. వారే సంతకం చేశారని.. సంతకం చేయలేదంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 16 నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించగా.. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తైంది. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.
ఇదీ చదవండి:Local Body Mlc Elections: నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ