సీఎం కేసీఆర్కు ఎన్నికలు, ఓట్లు, సీట్లపైనే దృష్టి తప్పితే రాష్ట్ర నీటి వాటాలను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందని.. సంగమేశ్వరం నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన కేసీఆర్ సర్కార్ చోద్యం చూస్తోందని మండిపడ్డారు.
జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఏమీ చేయలేని దద్దమ్మలని విమర్శించారు. అలంపూర్ నియోజకవర్గంలో సాగునీటికి, తాగునీటి ఇబ్బంది నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్పై ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వరం పనులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తే పట్టించుకోలేదని.. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్కు చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు.