ఈ నెల 10న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన - సిద్దిపేటలో కేసీఆర్ పర్యటన
19:57 December 05
ఈ నెల 10న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
ఈ నెల 10 న ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇళ్లు లేని నిరుపేదల కోసం గేటేడ్ కమ్యూనిటి తరహాలో నర్సాపూర్‌లో నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. వైద్య కళాశాలను, సిద్దిపేట పట్టణంలో నిర్మించిన భూగర్భ మురుగనీటి పారుదల వ్యవస్థను, రంగనాయక సాగర్ జలాశయం మధ్యలో నిర్మించిన అతిథి గృహం, వీటితో పాటు మిట్టపల్లి రైతు వేదిక, ఆడిటోరియంను సీఎం ప్రారంభిస్తారు.
రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. కోమటి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. చివరిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి :రైతుబంధు నిధులు, పంపిణీపై సోమవారం సీఎం సమీక్ష