తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణాక్షర లిఖితం: సీఎం కేసీఆర్‌ - CM KCR

cm kcr
cm kcr

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 12:56 PM IST

Updated : Sep 16, 2023, 6:27 PM IST

18:26 September 16

  • మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణాక్షర లిఖితం: సీఎం కేసీఆర్‌
  • పాలమూరు ప్రజలంటే ఒక్కప్పుడు ముంబయి, హైదరాబాద్‌లో అడ్డా కూలీలుగా పేరు: సీఎంకేసీఆర్‌
  • ఇవాళ తెలంగాణ ప్రజలే ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు: సీఎం కేసీఆర్‌
  • పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాను: సీఎం కేసీఆర్‌
  • కొందరు నేతల వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది: సీఎం కేసీఆర్‌
  • గత పాలకులు పాలమూరు జిల్లా నీటి వాటా గురించి ఎప్పుడూ అడగలేదు: సీఎం కేసీఆర్‌

18:15 September 16

  • తెలంగాణ తెచ్చి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఆనాడు కేసీఆర్‌ ప్రతిజ్ఞ చేశారు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
  • మాట ఇచ్చినట్లుగానే కేసీఆర్‌ తెలంగాణ సాధించారు, పాలమూరుకు కృష్ణా జలాలు తెచ్చారు
  • పాలమూరు జిల్లా ప్రజలు వలసపోతున్నా గత పాలకులు పట్టించుకోలేదు

18:15 September 16

  • నాగర్‌కర్నూల్‌: కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం అనంతరం బహిరంగ సభ

16:59 September 16

  • కృష్ణా జలాలు నింపిన కలశాలకు పూజలు చేసిన వేద పండితులు
  • కలశాలను పలు గ్రామాల సర్పంచ్‌లకు అందజేయనున్న అధికారులు
  • కృష్ణా జలాలతో పలు గ్రామాల్లో దేవుళ్లకు అభిషేకం చేయనున్న ప్రజాప్రతినిధులు

16:32 September 16

ప్రాజెక్టు విశేషాలు

  • పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 6 రిజర్వాయర్ల నిర్మాణం
  • శ్రీశైలం వెనుక జలాల నుంచి మోటార్లతో నీటి ఎత్తిపోతల
  • 60 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపకల్పన
  • 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణం
  • 1226 గ్రామాలకు తాగునీరు ఇచ్చేలా పాలమూరు- రంగారెడ్డి నిర్మాణం
  • 145 మె.వా. సామర్థ్యం గల 31 భారీ పంపులు ఏర్పాటు

16:24 September 16

  • నాగర్‌కర్నూల్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం
  • పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌
  • నార్లాపూర్‌ వద్ద తొలి పంపు స్విఛ్‌ ఆన్‌ చేయనున్న సీఎం
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్‌ ఆవిష్కరించనున్న సీఎం
  • డెలివరి సిస్టర్న్‌ వద్ద సీఎం ప్రత్యేక పూజలు, గంగాహారతి
  • కలశాల్లో కృష్ణా జలాలు గ్రామాలకు చేరవేసేలా ఏర్పాట్లు
  • అనంతరం కొల్లాపూర్ బహిరంగసభలో ప్రసంగించనున్న కేసీఆర్‌
  • సీఎం సభకు భారీ జనసమీకరణలో నిమగ్నమైన గులాబీ నేతలు

16:21 September 16

నాగర్‌కర్నూల్‌: కొల్లాపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్

15:53 September 16

భారీ వాహన శ్రేణిలో తరలివెళ్లిన సీఎం కేసీఆర్

  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ వాహన శ్రేణిలో తరలివెళ్లిన సీఎం కేసీఆర్
  • మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్ కర్నూల్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • తేజ కన్వెన్షన్‌లో మధ్యాహ్న భోజనం చేసిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
  • మధ్యాహ్న భోజనం తర్వాత నార్లాపూర్ పంప్ హౌస్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్
  • సీఎం కాన్వాయ్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

15:10 September 16

  • నాగర్‌కర్నూల్‌ నుంచి నార్లాపూర్ పంప్ హౌస్‌కు బయలుదేరిన సీఎం

14:55 September 16

కాసేపట్లో నాగర్‌కర్నూల్‌ చేరుకోకున్న సీఎం కేసీఆర్

12:34 September 16

LIVE UPDATES : ప్రగతిభవన్‌ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాకు బయలుదేరిన సీఎం కేసీఆర్

  • ప్రగతిభవన్‌ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్‌
  • పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్‌
  • భారీ కాన్వాయ్‌తో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బయల్దేరిన కేసీఆర్‌
  • నార్లాపూర్‌లో తొలి పంపు స్విచ్‌ ఆన్‌ చేయనున్న సీఎం కేసీఆర్‌
  • పాలమూరు-రంగారెడ్డి పైలాన్‌ ఆవిష్కరించనున్న కేసీఆర్‌
  • డెలివరి సిస్టర్న్‌ వద్ద సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు, గంగాహారతి
  • కలశాల్లో కృష్ణా జలాలు గ్రామాలకు చేరవేసేలా ఏర్పాట్లు
  • అనంతరం కొల్లాపూర్ బహిరంగసభలో ప్రసంగించనున్న కేసీఆర్‌
Last Updated : Sep 16, 2023, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details