ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ రూ.200 ఇచ్చేవారని... తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ వెయ్యి రూపాయలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం పింఛన్ వంద శాతం పెంచి 2016 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నట్లు చెప్పారు.
'రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే ఇవన్నీ ఎలా అమలు చేస్తాం?' - కేసీఆర్
సంక్షేమ పథకాల అమలుపై వెనకడుగు లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయా శాఖలకు నిధుల సమస్య లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే... సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామని ప్రశ్నించారు.
'రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే ఇవన్నీ ఎలా అమలు చేస్తాం?'
రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామని ప్రశ్నించారు. గతంలో పాల ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదని అన్నారు. అప్పట్లో విజయడెయిరీ 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉండేదని... ప్రస్తుతం రూ.16 కోట్లు లాభాల్లో ఉందని అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో వెల్లడించారు.
ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం