తెలంగాణలో అనేక రెవెన్యూ సంస్కరణలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ హయాంలో కొన్ని మార్పులు జరిగాయని అసెంబ్లీలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులపై గతంలో అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. గత పాలకులు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
రెవెన్యూ సంస్కరణల వల్ల ప్రజల ఇబ్బందులు తొలగుతాయని స్పష్టం చేశారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని వివరించారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని హామీనిచ్చారు. ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించేందుకే ప్రయత్నమని తెలిపారు. వీఆర్‌వోలను స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తాం... వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని హామీనిచ్చారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వీఆర్‌వో వ్యవస్థ రద్దు బిల్లులు ప్రవేశపెట్టామని చెప్పారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం మొత్తం చర్చిస్తామన్నారు.