తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: 'ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలను తీరుస్తున్నాం' - cm kcr speech

దళిత బంధు (dalit bandhu) పథకాన్ని చూసి.. కొందరికి బీపీ వస్తోందని సీఎం కేసీఆర్ (cm kcr)పేర్కొన్నారు. ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారని విమర్శిస్తున్నారని.. చేసిన పనికి రాజకీయ లాభం ఆశిస్తే తప్పేంటని సీఎం ప్రశ్నించారు. తెరాస ప్రజల్లో ఉండే రాజకీయ పార్టీ అని.. హిమాలయాల్లోని సన్యాసుల మఠం కాదన్నారు. ప్రతీదాన్ని అడ్డుకునే వారు ఎప్పుడూ ఉంటాయని.. వారిని చూసి మంచి వాళ్ల ప్రస్థానం ఎప్పుడూ ఆగదన్నారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో యువతే కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ (cm kcr)పిలుపునిచ్చారు.

CM KCR
CM KCR

By

Published : Jul 21, 2021, 6:09 PM IST

Updated : Jul 21, 2021, 10:45 PM IST

కేసీఆర్ ప్రసంగం

హుజూరాబాద్ కాంగ్రెస్ మాజీ నేత పైడి కౌశిక్ రెడ్డి (koushik reddy)ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) సమక్షంలో తెరాసలో చేరారు. దళిత బంధు (dalit bandhu) ఎన్నికల కోసం ప్రవేశ పెట్టిన పథకం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారం కోసం జరిగే ఎన్నికలకు ఇంకా రెండున్నేరళ్ల సమయం ఉందన్నారు. అయితే హుజూరాబాద్​లో పైలట్ ప్రాజెక్టు అక్కడి ఉపఎన్నిక కోసమేనని కొందరు మాట్లాడుతున్నారని.. చేసిన పనికి లాభం ఆశిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెరాస ప్రజల్లో ఉండే రాజకీయ పార్టీ అని.. హిమాలయాల్లోని రాజకీయ మఠం కాదని.. కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తామన్నారు. తనకు కరీంనగర్ జిల్లాతో సెంటిమెంట్ ముడిపడి ఉందని.. రైతుబంధు కూడా హుజురాబాద్‌లోనే ప్రారంభించామని.. రైతుబీమా కరీంనగర్‌లోనే మొదలు పెట్టామన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు లేవని గుర్తు చేశారు. రైతుబంధు, రైతుబీమా, గురుకులాలు, కేసీఆర్ కిట్, ధరణి వంటి పథకాల కోసం ఎవరూ అడగలేదన్నారు. ఓట్లతో సంబంధం లేకుండా ప్రజలు కోరుకునే కార్యక్రమాలు చేపట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతీ పథకం వెనక ఎంతో మథనం, ఆలోచన ఉంటుందన్నారు.

తెరాసలోకి కౌశిక్‌ రెడ్డి - సీఎం కేసీఆర్ ప్రసంగం

ఓట్ల కోసమే ఉంటుందా?

ప్రతీ కార్యక్రమం ఓట్ల కోసమే ఉంటుందా అని ప్రశ్నించిన కేసీఆర్(cm kcr)... కొందరు ఏదేదో మాట్లాడుతుంటారని.. ప్రజలు వాటిని గమనిస్తుంటారని వెల్లడించారు. తనను గతంలోనూ ఎన్నో తిట్టారని... అయినప్పటికీ ప్రయాణం ఆపలేదని.. తెలంగాణ సాధించామని స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని.. సామాజిక బాధ్యత ముఖ్యమని స్పష్టం చేశారు. కొందరు అధికారం కోసం అతిచేష్టలు చేస్తుంటారని మండిపడ్డారు. తిట్టాలంటే ఒకరోజు సరిపోదని.. కానీ సంస్కారం ఉన్నవాళ్లు బాధ్యతగా ఉంటారని తెలిపారు. ఆరోపణలు చేస్తున్న పార్టీ కూడా అధికారంలో ఉందని... అప్పుడు ఏం చేశారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం చేసే పని ఎక్కువ.. ప్రచారం తక్కువగా ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ వారికి పాలన రాదన్న ఆంధ్రానే ఇప్పుడు గల్లంతయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పండిన పంట.. ఏపీలో పండిదెంతో చూస్తే చాలన్నారు.

కుటుంబ రక్షణ ప్రత్యేక నిధి

కొందరు వంకర, టింకరగా మాట్లాడుతున్నప్పటికీ.. దళిత బంధు పథకం (dalit bandhu) తమాషా పథకమేమీ కాదని ప్రకటించారు. దేశవ్యాప్తంగా దళితులు పేదరికంతో పాటు.. సామాజిక అణిచివేతకు గురయ్యారని చెప్పారు. దళిత బంధు(dalit bandhu) పథకం కింద లబ్ధిదారులు జీవితంలో మళ్లీ పేదరికానికి వెళ్లకుండా పకడ్బందీగా కార్యక్రమం రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక బార్ కోడ్‌తో కూడిన కార్డు ఇస్తామని.. జిల్లా స్థాయిలో భారీ రక్షణ నిధి ఉంటుందని కేసీఆర్ (cm kcr)వివరించారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఎస్సీలు నిరుపేదలుగానే ఉన్నారు. పేదరికం, సామాజిక వివక్షను ఎస్సీలు ఎదుర్కొంటుున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే దళిత బంధు(Dalith bandhu). ఈ పథకం చూసి కొందరికి బీపీ పెరుగుతోంది. బీపీ పెంచుకునే వారి ధ్యాసంతా ఓట్ల పైనే. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. దళిత బంధు పథకం ఎన్నికల కోసం తీసుకురాలే.

- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు

కౌశిక్ రెడ్డికి (koushik reddy)ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని.. హుజురాబాద్, కరీంనగరే కాకుండా రాష్ట్రస్థాయిలో ఆయన సేవలందిస్తారని కేసీఆర్ (cm kcr)పేర్కొన్నారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయాల్లో అధికారం ఒక్కటే ముఖ్యం కాదని.. భాగస్వామ్యం కీలకమని తెలిపారు. రాజకీయాలు నిరంతర ప్రక్రియ అని గెలుపు ఓటములు సహజమని స్పష్టం చేశారు. శాశ్వతంగా అధికారం ఎవ్వరికీ ఉండదని.. ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు. ప్రభుత్వం ప్రజలకు మంచే చేస్తుంది తప్ప.. తప్పు చేసే అధికారం లేదన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని.. ప్రతీ ఎన్నికల్లో గెలిపిస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం కష్టపడి సాధించాం. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు.. ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యా.. ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను మాట్లాడమన్నారు. నా నుంచి కాదని చెప్పిన. వ్యవసాయం మీద మాట్లాడానికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లను కలిసి చర్చించా.. ఆ రోజు నేను వ్యవసాయం మీద మాట్లాడితే.. అప్పటి స్పీకర్ శ్రీపాదరావు ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు.

- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణ భవన్​​లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 21, 2021, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details