పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క (clp leader batti vikramarka) ఆరోపించారు. ఉపాధి హామీ నిధులు శ్మశాన వాటికలకు, పల్లెప్రగతికి వాడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ డబ్బులతోనే ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లు సర్పంచులు చెబుతున్నారని వెల్లడించారు. ట్రాక్టర్ కిస్తీలు కూడా పంచాయతీ నిధులతోనే కడుతున్నారని అన్నారు. విద్య, ఆరోగ్యం, పంటలకు మద్దతు ధర తదితర అంశాలు పల్లెప్రగతిలో పొందుపరచాలని సూచించారు. కేవలం మొక్కలు నాటితే సరిపోదని భట్టి చురకలంటించారు.
ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారు. ఉపాధి హామీ నిధులు శ్మశాన వాటికలకు, పల్లెప్రగతికి వాడుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. పంచాయతీ డబ్బులతోనే ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లు సర్పంచులు చెబుతున్నారు. ట్రాక్టర్ కిస్తీలు కూడా పంచాయతీ నిధులతోనే కడుతున్నారు.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
భట్టి ఆరోపణలకు కేసీఆర్ సమాధానం