కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కి చెందిన బత్తుల వెంకటేశ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కేసీఆర్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇంటి ముందే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గ్రామస్థులు, కుటుంబసభ్యులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటంతో కూడిన కేక్‌ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
ఇంటి ముందే కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న అభిమాని
తన ఇంటి ముందే సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కార్యకర్త. తల్లిదండ్రుల తర్వాత కేసీఆరే తనకు దేవుడని... రోజూ ఆయనను చూసుకునేందుకు ఇంటి ముందే ఆవిష్కరించుకున్నట్లు వివరించాడా అభిమాని.
CM KCR STATUE INAUGURATED IN FRONT OF KCR FAN'S HOME
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉంటున్నారని వెంకటేశ్ వివరించారు. లక్ష రూపాయల ఖర్చుతో విగ్రహాన్ని తయారు చేయించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత కేసీఆర్‌నే దేవుడిగా భావిస్తానని, ప్రతిరోజు ఉదయం ఆయనను చూడాలనే ఉద్దేశంతో ఇంటి ఎదుటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నానన్నాడు. రాష్ట్రానికి మరో 20 ఏళ్ల పాటు కేసీఆరే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెంకటేశ్ తెలిపాడు.
ఇవీ చూడండి:ట్విట్టర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే కేసీఆర్
Last Updated : Feb 17, 2020, 7:29 PM IST