శ్రీరామనవమిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని... కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు. భద్రాచలం ఆలయంలో పూజారులు, అధికారుల మధ్య కల్యాణం జరుగుతుందని తెలిపారు.
సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలి: సీఎం కేసీఆర్ - హైదరాబాద్ జిల్లా వార్తలు
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వల్ల కల్యాణ వేడుక సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు. భద్రాద్రిలో పూజారులు, అధికారుల సమక్షంలో రాములోరి కల్యాణం జరుగుతుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు, శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాముల వారి కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్ ప్రసారాల ద్వారా వీక్షించి.... స్వామివారిని దర్శించుకోవాలని సీఎం కోరారు. లోకకల్యాణం కోసం సీతారాములు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
ఇదీ చదవండి:భద్రకాళి ఆలయంలో కన్నుల పండువగా వసంత నవరాత్రి ఉత్సవాలు