అటవీ పునరుజ్జీవనం మీద కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. వివాదరహిత అటవీ భూముల్లో పునరుజ్జీవనం ప్రారంభించాలని సూచించారు. జాతీయరహదారుల పక్కన పచ్చదనం బాధ్యత రోడ్ల గుత్తేదార్లదే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
CM KCR: 'ఎస్సీ సాధికారత కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది'
21:48 June 26
ఎస్సీ సాధికారత కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది: సీఎం
ఎస్సీల అభివృద్ధిని ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని వెల్లడించారు. ఎస్సీ సాధికారత కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. రేపటి భేటీలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఎస్సీ సాధికారత అమలులో కలెక్టర్లు, అధికారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. అర్హులైన 8 లక్షల ఎస్సీ కుటుంబాలకు దశలవారీగా అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు.
ఎస్సీ సాధికారత కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని సీఎం అన్నారు. ఎస్సీ సాధికారత పథకానికి, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు. ఏటా కొంతమంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని సీఎం సూచించారు. ఇతర పథకాల్లాగే పారదర్శకంగా నిధులు అందాలన్నారు. రైతుబంధు, వృద్ధాప్య ఫించన్లవలే నేరుగా డబ్బు జమ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం